శ్రీసత్యసాయి జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాయలసీమ జిల్లాల ఇంచార్జ్ జయరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నేడు అనంతపురం ఆర్ అండ్ బి బంగ్లాలో నిర్వహించారు.

జిల్లా గౌరవ అధ్యక్షులుగా హిందూపురం నుండి రాయల్ న్యూస్ పక్షపత్రికకు చెందిన ఎన్. నారాయణను ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షులుగా కదిరి నుండి వాయిస్ ఆఫ్ విక్టరీ ఎడిటర్ బి. రవీంద్రనాయక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మడకశిరకు చెందిన పల్లె జీవనం మాసపత్రిక ఎడిటర్ కే.ఎన్. నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా ఉపాధ్యక్షులుగా ధర్మవరం నుండి జనతరంగం డైలీ ఎడిటర్ సాకే శ్రీనివాసులు, కదిరి నుండి సంధ్యవేళ సాయంకాలం ఎడిటర్ కోలా బ్రహ్మయ్యలను ఎన్నుకున్నారు. జాయింట్ సెక్రెటరీగా పెనుగొండకు చెందిన జాబిలి మాసపత్రిక ఎడిటర్ పి. మల్లికను, కోశాధికారిగా కదిరి నుండి ఆంధ్ర ప్రతి దినపత్రిక సబ్ ఎడిటర్ పి. మహబూబ్ బాషాను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ గౌరవ అధ్యక్షులు తలారి రామాంజనేయులు, జిల్లా నాయకులు డాక్టర్ సూర్య, సీనియర్ జర్నలిస్టులు ఆజాద్, సుబ్బయ్య, శంకరప్రసాద్, బాబ్జాన్, సురేష్, శ్రీరాములు, ఓ. భాస్కర్, డాక్టర్ ఉద్దండం చంద్ర శేఖర్, రామ్మూర్తి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలో జర్నలిస్టుల సంఘటిత శక్తిని బలోపేతం చేయడం, మీడియా వర్గాల సమస్యల పరిష్కారం, వృత్తి పరమైన హక్కుల సాధన లక్ష్యంగా ఈ నూతన కమిటీ పనిచేయనుందని సంఘం నాయకులు పేర్కొంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో జర్నలిస్టుల ఐక్య వేదికగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మరింత చురుకుగా పనిచేయడానికి ఈ ఎన్నికల ద్వారా కొత్త బృందం ఏర్పడినట్లు జిల్లా వర్గాలు భావిస్తున్నాయి.