రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైఎస్ఆర్ కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. యుగంధర్ ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవల అమలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. జిల్లా స్థాయి అధికారిగా ఆయన ఈ తనిఖీ సందర్భంగా అన్ని విభాగాలను విడివిడిగా చూడటం ద్వారా కేంద్రం పనితీరును ఆవలోకనం చేశారు.
PHC ముద్దనూరులోని OP విభాగం, రిసెప్షన్, ల్యాబొరేటరీ, ఫార్మసీ, లేబర్ రూమ్ తదితర విభాగాలను డాక్టర్ పి. యుగంధర్ పరిశీలించారు. సేఫ్ డెలివరీ క్యాలెండర్‌ను పరిశీలించి, ముద్దనూరులో ప్రసవాల సంఖ్య తగ్గుతున్న పరిస్థితిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ANMs, MLHPs ఫీల్డ్ స్థాయిలో పనిచేసి, గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
EHR, మూమెంట్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్లు, ల్యాబ్, ఫార్మసీ రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. రికార్డులన్నీ సమయానికి, సక్రమంగా నమోదు చేయాలని, సంబంధిత యాప్స్ అన్నీ అప్డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా రికార్డు నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని ఆయన స్పష్టం చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
తనిఖీ అనంతరం PHC ముద్దనూరు పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని డాక్టర్ పి. యుగంధర్ సిబ్బందికి సూచించారు. ఫీవర్స్ సర్వే నిర్వహించి, జ్వరాలు, అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం, సానుకూల అభిప్రాయం పెంపొందించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ పి. యుగంధర్ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో PHC స్థాయి వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ యస్. ఆరిఫ్ఫులా, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సి. మహమ్మద్ తహ, PHC ముద్దనూరు వైద్య అధికారి డాక్టర్ యస్. కరీస్మా, CHO వై. ప్రసాద్ యాదవ్, సూపెర్వైసోర్ యస్. రామారావు, కె. శివగంగ, LT జాసన్, ఫార్మసీ ఆఫీసర్ జగదీష్, వైద్య సిబ్బంది రాణి, జైకుమార్ తదితరులు పాల్గొన్నారు.













