ప్రొద్దుటూరు విద్యా విభాగంలో కొత్త నియామకం జరిగింది. ఎర్రగుంట్లలో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శివప్రసాద్ ప్రొద్దుటూరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (FAC)గా బాధ్యతలు స్వీకరించారు. సంబంధిత అధికారుల సమక్షంలో బాధ్యతల హస్తాంతరణ ప్రక్రియ పూర్తయింది.

శివప్రసాద్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విద్యా రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్య సూచనలు చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణ, ఉపాధ్యాయుల నియామకం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం.

ప్రొద్దుటూరు పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వివరాలను స్పష్టంగా, పారదర్శకంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ముందస్తుగా పూర్తి సమాచారం పొందేలా ఫీజు నిర్మాణాన్ని పాఠశాల ప్రాంగణంలో కనిపించేలా ఉంచాలని సంబంధిత నిర్వహణలకు సూచించినట్లు తెలిసింది.

ఉపాధ్యాయుల నియామకంపై కూడా శివప్రసాద్ దృష్టి పెట్టారు. B.Ed., TTC వంటి అర్హతలు పూర్తి చేసిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయ‌న సూచించారు. అర్హతలేని వ్యక్తులను బోధన బాధ్యతలకు నియమించకుండా ఉండాలని, విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు విద్యా శాఖ వర్గాలు తెలియజేశాయి.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరాన్ని శివప్రసాద్ ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యత వంటి అంశాలను మెరుగుపరచేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆయ‌న సూచించినట్లు సమాచారం. ఈ దిశగా హెడ్ మాస్టర్స్ , స్కూల్ మానేజిమెంట్ కంమిట్టీస్ , మండల్ స్థాయి అధికారులు కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించినట్లు విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

కొత్త డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (FAC) బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రొద్దుటూరు పరిధిలోని పాఠశాలలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. శివప్రసాద్ సూచనలు అమలులోకి వస్తే ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారదర్శకత, నాణ్యత పెరిగే అవకాశం ఉందని స్థానిక విద్యా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.