న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ హయాంలో రాజ్యాంగంపై నిరంతర దాడులు జరుగుతున్నాయని, బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వేధింపుల సాధనంగా వాడుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు.

ఇండియా బ్లాక్ కూటమి పార్టీల నేతల సమావేశం సోమవారం నాడు ఢిల్లీలోని చొన్స్తితుతిఒక్లబ్్ Clubలో జరిగింది. మోదీ ప్రభుత్వంలో దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంలో కూటమి పార్టీల నేతలను ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు.

దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులు దేశానికి రాకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందని ఖర్గే వ్యాఖ్యానించారు. పలు రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాలు పెరుగుతున్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Special Intensive Revision (SIR) ప్రక్రియ కారణంగా లక్షలాది మంది ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది తీవ్రమైన ముప్పుగా ఆయన పేర్కొన్నారు. ఎంఎస్ఎమ్ఈ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

మోదీ ప్రభుత్వంలో పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాల వల్ల యువత భారీగా నష్టపోతున్నారని ఖర్గే విమర్శించారు. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

మూడేళ్ల క్రితం ఇండియా కూటమి ఏర్పడిందని, ఇటీవల పార్లమెంటులో ఆ కూటమి బలం అధికార పక్షం అనుభవించిందని ఖర్గే గుర్తుచేశారు. లోక్‌సభలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన Delimitation Billను ఓడించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 17న ఇండియా కూటమి పార్టీలన్నీ దృఢంగా ఏకమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఖర్గే అభిప్రాయపడ్డారు.

దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిపక్షం ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కీలక సమావేశానికి 23 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. వారిలో Sonia Gandhi, Rahul Gandhi, Akhilesh Yadav, Tejashwi Yadav, Mamata Banerjee, Dipankar Bhattacharya, Mehbooba Mufti, Supriya Sule, Brivan Thol తదితరులు ఉన్నారు.

అయితే ఇండియా కూటమిలో కీలక భాగస్వాములైన DMK, AAP పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. వారి గైర్హాజరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.