బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#న్యూఢిల్లీ

48 articles

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB
క్రీడలు

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB

ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, గాయంతో దూరంగా ఉన్న నవీన్-ఉల్-హక్, గుల్బదిన్ నైబ్ తిరిగి జట్టులోకి వచ్చారు. నూర్ రహ్మాన్‌కు తొలి అవకాశం లభించగా, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ నబీ వంటి కీలక స్పిన్నర్లు జట్టులో కొనసాగుతున్నారు.

25, ఆగ 2026

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం  : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
తెలంగాణ

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

28, జులై 2026

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జాతీయం

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.

23, జులై 2026

ఇంటర్నెట్‌ లేకుండానే యూపీఐ చెల్లింపులు…
బిజినెస్

ఇంటర్నెట్‌ లేకుండానే యూపీఐ చెల్లింపులు…

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్నెట్‌ లేకుండానే పీఓఎస్‌ టెర్మినల్‌ వద్ద యూపీఐ లైట్‌ ద్వారా గరిష్ఠంగా రూ.2,000 వరకు చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోంది. విమాన క్యాబిన్లు, భూగర్భ రైలు నెట్‌వర్క్‌ల వంటి ఇంటర్నెట్‌ సమస్యలున్న ప్రాంతాల్లో చిన్న మొత్తాల డిజిటల్‌ చెల్లింపులు సులభతరం చేయడమే లక్ష్యంగా బ్యాంకులు, యూపీఐ యాప్‌ ప్రొవైడర్లు అవసరమైన సాంకేతిక మార్పులు చేపడుతున్నారు.

22, జులై 2026

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు
జాతీయం

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై విచారణలో సుప్రీంకోర్టు తొమ్మిదో తరగతిలో మూడో భాష ప్రవేశపెట్టడం విద్యార్థులకు అదనపు భారమని సూచించింది. కొత్త భాషను నేర్పాలనుకుంటే ఐదో లేదా ఆరో తరగతి నుంచే ప్రారంభించాలని, విద్యార్థుల మానసిక ఒత్తిడి, విద్యా భారం అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

16, జులై 2026

పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం
వ్యవసాయం

పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం

కేంద్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధిస్తూ జూలై 14 నుంచి అమల్లోకి వచ్చేలా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. కీటకనాశన చట్టం 1968 ప్రకారం దిగుమతి, తయారీ, రవాణా, పంపిణీపై పూర్తి నిషేధం ఉండగా, కంపెనీల అభ్యంతరాల కోసం ఆగస్టు 13 వరకు గడువు ఇచ్చింది. పారాక్వాట్ వల్ల వేలాది మంది రైతులు మృతి చెందడం, దీనికి నిర్దిష్ట విరుగుడు లేకపోవడం వైద్యులు, నిపుణుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

15, జులై 2026

ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్‌ – యూపీ, ఉత్తరాఖండ్, కేరళకు ఆరెంజ్ హెచ్చరిక
వాతావరణం

ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్‌ – యూపీ, ఉత్తరాఖండ్, కేరళకు ఆరెంజ్ హెచ్చరిక

భారత వాతావరణ శాఖ ఢిల్లీ, హర్యానాలకు రెడ్ అలర్ట్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, భారీ నుంచి అతి భారీ వర్షాలు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీ, ఘజియాబాద్‌లో వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతినడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

9, జులై 2026

క్రికెట్ ప్రపంచంలో విషాదం: ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత
క్రీడలు

క్రికెట్ ప్రపంచంలో విషాదం: ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత

ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) అరుదైన HLH వ్యాధితో పోరాడుతూ న్యూఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం కన్నుమూశారు. 2015 World Cupలో కీలక ప్రదర్శనలతో గుర్తింపు పొందిన ఆయన మరణంపై ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, దేశ క్రికెట్ పునాదిని నిర్మించిన ప్రముఖుల్లో జద్రాన్ ఒకరని పేర్కొంది.

7, జులై 2026

6 నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన
జాతీయం

6 నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి 11వ తేదీ వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను సందర్శించే మూడు దేశాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ పాత్రను బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర భద్రత, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయా దేశాల అగ్రనేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపి సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.

5, జులై 2026

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు

వాట్సాప్‌ ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌ సైబర్‌ నేరాలు, ఫిషింగ్‌, ఇంపర్సనేషన్‌, డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. MeitY, యూజర్‌నేమ్‌ వ్యవస్థ అమలు విధానం, భద్రతా ప్రమాణాలు, వినియోగదారుల గుర్తింపు ధృవీకరణపై మూడు రోజుల్లో వివరణ కోరుతూ, సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేయవద్దని సూచించింది.

2, జులై 2026

వికసిత్ భారతే లక్ష్యం : కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్
జాతీయం

వికసిత్ భారతే లక్ష్యం : కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.

29, జూన్ 2026

పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే, పౌరసత్వ రుజువు కాదు: కేంద్రం స్పష్టం
జాతీయం

పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే, పౌరసత్వ రుజువు కాదు: కేంద్రం స్పష్టం

కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ పాస్‌పోర్ట్ అనేది కేవలం విదేశీ ప్రయాణానికి ఉపయోగించే పత్రం మాత్రమేనని, పౌరసత్వ రుజువుగా పరిగణించరాదని మరోసారి స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా పాస్‌పోర్ట్ స్వరూపంపై ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ, పౌరసత్వానికి సంబంధించిన అంశాలు వేర్వేరు చట్టాల పరిధిలోకి వస్తాయని తెలిపింది.

25, జూన్ 2026

మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ!
నేరాలు

మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ!

దేశ రాజధాని ఢిల్లీలో  ఒక భారీ సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ ఎంపీ నరేష్ కుమార్ గుజ్రాల్ సైబర్ నేరగాళ్ల చేతిలో ఏకంగా రూ. 7.80 కోట్ల మేరకు మోసపోయారు.

18, జూన్ 2026

‘ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’ పేరుపై యూటర్న్‌
అంతర్జాతీయం

‘ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’ పేరుపై యూటర్న్‌

అమెరికా రక్షణశాఖ ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’ పేరును మళ్లీ ‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చి, పేరులోని ‘ఇండో’ పదాన్ని తొలగించింది. చారిత్రక మూలాలను గౌరవించడానికేనని వాషింగ్టన్‌ చెబుతున్నప్పటికీ, ఇండో-పసిఫిక్‌ వ్యూహాత్మక సమీకరణల్లో భారత్‌ ప్రాధాన్యత తగ్గుతుందా అనే సందేహాలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి.

17, జూన్ 2026

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. స్పీఎకర్ ఓం బిర్లాకు ఉద్ధవ్ లేఖ
జాతీయం

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. స్పీఎకర్ ఓం బిర్లాకు ఉద్ధవ్ లేఖ

పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంఛనంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది.

17, జూన్ 2026

ఆధార్‌ గుర్తింపు పరిమితిపై సుప్రీంకోర్టు విచారణ
జాతీయం

ఆధార్‌ గుర్తింపు పరిమితిపై సుప్రీంకోర్టు విచారణ

ఆధార్‌ను కేవలం వ్యక్తిగత గుర్తింపు పత్రంగానే పరిమితం చేయాలని, పౌరసత్వం, నివాసం, చిరునామా, జన్మతేదీకి రుజువుగా ఉపయోగించరాదని కోరుతూ సీనియర్‌ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఆధార్‌ చట్టం, UIDAI నోటిఫికేషన్‌ స్పష్టమైనప్పటికీ అమలులో విరుద్ధాలు, అక్రమ వలసదారుల దుర్వినియోగం ఉన్నందున ఓటర్‌ నమోదు వంటి ప్రక్రియల్లో ఆధార్‌ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని పిటిషన్‌లో పేర్కొనగా, తదుపరి విచారణ తేదీని కోర్టు తరువాత నిర్ణయించనుంది.

17, జూన్ 2026

విదేశీ పర్యటనల్లో మోదీ సెంచరీ
జాతీయం

విదేశీ పర్యటనల్లో మోదీ సెంచరీ

మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ ఇప్పటివరకు మొత్తం 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు 78 దేశాలను సందర్శించిన మోదీ, మొదటి దఫాలో 49, రెండో దఫాలో 27, మూడో దఫాలో ఇప్పటివరకు 24 పర్యటనలు చేశారు. తాజా యూరప్‌ పర్యటనలో భాగంగా స్లోవేకియాలో ద్వైపాక్షిక చర్చలు జరిపి, జీ-7 సదస్సులో కూడా పాల్గొంటున్నారు.

16, జూన్ 2026

కామన్వెల్త్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌ జట్టులో నీరజ్‌ చోప్రా
క్రీడలు

కామన్వెల్త్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌ జట్టులో నీరజ్‌ చోప్రా

కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం 32 మందితో కూడిన భారత అథ్లెటిక్స్‌ జట్టును ఏఎ్‌ఫఐ ప్రకటించింది. వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న నీరజ్‌ చోప్రా పేరును తాత్కాలికంగా జాబితాలో చేర్చి, 82.61 మీటర్ల అర్హతా దూరం సాధనపై అతని ఎంపికను ఆధారపెట్టింది. రోహిత్‌ యాదవ్‌, యష్‌వీర్‌ సింగ్‌ సహా పలు విభాగాల్లో అథ్లెట్లు ఇప్పటికే క్వాలిఫై కాగా, గ్లాస్గోలో మెడల్స్‌ లక్ష్యంగా ఈ జట్టును ఎంపిక చేసినట్లు సమాఖ్య వర్గాలు సూచిస్తున్నాయి.

15, జూన్ 2026

3 నౌకల్లో చిక్కుకున్న 562 మంది భారత నావికులు
జాతీయం

3 నౌకల్లో చిక్కుకున్న 562 మంది భారత నావికులు

హోర్ముజ్‌ జలసంధిలో గత 108 రోజులుగా నిలిచిపోయిన 13 వాణిజ్య నౌకల్లో 562 మంది భారత నావికులు చిక్కుకుపోయారు. ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, క్షిపణి దాడుల భయంతో నౌకలను కదిలించేందుకు కెప్టెన్లు వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత నావికుల సురక్షిత తిరుగు ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం సంబంధిత దేశాలతో సమన్వయం కొనసాగిస్తోంది.

15, జూన్ 2026

మేము జోక్యం చేసుకోలేం..  సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ
రాజకీయాలు

మేము జోక్యం చేసుకోలేం.. సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌ అగ్రనేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడంపై ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో మధ్యప్రదేశ్‌ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు BJP అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

12, జూన్ 2026

ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్‌
జాతీయం

ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్‌

కాంగ్రెస్‌ సిద్ధాంతపరంగా నిలబడి ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనగల ఏకైక పార్టీగా ఉందని, వచ్చే రెండేళ్లలో పార్టీ మరింత బలపడుతుందని రాహుల్‌ గాంధీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన విమర్శించగా, మోదీ పాలనపై దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ విలీన వార్తలు ఆధారరహితమని కేసీ వేణుగోపాల్‌ ఖండించారు.

12, జూన్ 2026

రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్ ఇంధన కొనుగోళ్లకు బ్రేక్
బిజినెస్

రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్ ఇంధన కొనుగోళ్లకు బ్రేక్

వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్‌గా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం 90 రోజుల తాత్కాలిక నిషేధం విధించింది. రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య భారీ వ్యత్యాసం వల్ల కమర్షియల్ వినియోగదారులు రిటైల్ బంకులవైపు మళ్లడంతో మార్కెట్‌లో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదం ఉందని భావించి, అధీకృత బల్క్ సరఫరాదారుల ద్వారా మాత్రమే కొనుగోళ్లు చేయాలని ఆదేశించింది.

12, జూన్ 2026

రూ. 954 కోట్ల కుంభకోణం: భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌
అంతర్జాతీయం

రూ. 954 కోట్ల కుంభకోణం: భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌

సుమారు 100 మిలియన్ డాలర్లు (రూ. 954 కోట్లు) విలువైన ఆర్థిక కుంభకోణం కేసులో భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజానిని అమెరికా అధికారులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు. Cantor Group V LLC ద్వారా రియల్ ఎస్టేట్ లోన్లకు తాకట్టు ఆస్తుల విలువలను కృత్రిమంగా పెంచి చూపడం, నకిలీ టైటిల్ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టించడం, షెల్ కంపెనీలతో బ్యాంకును మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

11, జూన్ 2026

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్
జాతీయం

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం జరుగుతుందనే ప్రచారం పూర్తిగా పుకార్లేనని, అలాంటి చర్చలు లేదా ప్రతిపాదనలు లేవని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, అధికారికంగా ప్రకటించని విషయాలను నిజాలుగా తీసుకుని ప్రచారం చేయడం తగదని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు తమ తమ స్వతంత్ర వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

11, జూన్ 2026

మీనాక్షి నాటరాజన్‌కు కి దక్కని ఊరట!
రాజకీయాలు

మీనాక్షి నాటరాజన్‌కు కి దక్కని ఊరట!

రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున తాము తక్షణ జోక్యం చేసుకోలేమని గురువారం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆమె పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

11, జూన్ 2026

ప్రధానిగా చరిత్ర సృష్టించిన మోదీ : మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్
జాతీయం

ప్రధానిగా చరిత్ర సృష్టించిన మోదీ : మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్

భారత ప్రధానిగా 4,399 రోజుల సుదీర్ఘ పాలనతో నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించగా, కేంద్ర మంత్రివర్గం అభినందన తీర్మానం ఆమోదించి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, అమెరికా రాయబారి సెర్గియో గోర్ తదితరులు మోదీ నాయకత్వాన్ని, ప్రజాసేవను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

10, జూన్ 2026

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!
జాతీయం

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ సాధించేందుకు ఎన్‌డీఏ కూటమి టీఎంసీ, డీఎంకే, ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం సక్రియంగా కసరత్తు చేస్తోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. టీఎంసీ, డీఎంకేలో సంభవించే చీలికలు, రాజ్యసభలో టీఎంసీ సభ్యుల పునర్నిర్వచన అవకాశాల నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్‌డీఏ బలం స్పెషల్ మెజారిటీకి చేరువ కావచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

9, జూన్ 2026

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు
జాతీయం

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్‌ ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్‌ రాయ్‌ పార్టీ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ, మమతా గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, RG Kar ఆస్పత్రి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తినందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

9, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది
జాతీయం

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది

న్యూఢిల్లీ లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో సువేందు ఆధికారితో టీఎంసీ ఎంపీలు సమావేశం కావడం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీలో చీలిక సంకేతాలుగా భావిస్తున్నారు. 20 మందికి పైగా ఎంపీలు సువేందు టచ్‌లో ఉన్నారని, వీరు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters